News

తెలంగాణ నేతలకు ఊరట


సికింద్రాబాద్ రైల్వే కోర్టులో తెలంగాణ నేతలకు ఊరట లభించింది. తెలంగాణ ఉద్యమ సందర్భంగా 2011లో రైల్‌రోకోలో పాల్గొన్న పలువురు నేతలపై కేసులను రైల్వేకోర్టు కొట్టివేసింది. ఈ కేసుపై ఈరోజు విచారించిన కోర్టు దత్తాత్రేయ, కేటీఆర్‌, నాయిని, పద్మారావు, కిషన్‌రెడ్డి, కోదండరాంపై నమోదైన రైల్వే కేసులు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.